HYD: ఖైరతాబాద్ గణపతి గంగమ్మఒడికి చేరాడు. ఆయనరాకతో 11 రోజుల పాటు నగరమంతా కలకలలాడింది. ఉత్సవాల్లో భాగమైన నిమజ్జనం అనివార్యం కావడంతో గంగమ్మ చెంతకు చేరాడు. ‘ఎప్పటిలాగే మీకోసం మళ్లీ వస్తా.. అప్పటిదాకా మిమ్మల్నే చూస్తుంటా’ అన్నంట్లున్న ఆయన చూపు అందరి హృదయాలను బరువెక్కించింది. ఈ మహా క్రతువును చూసేందుకు వేలాదిగా ప్రజలు హుస్సేన్ సాగర్‌కు తరలివచ్చారు.