PPM: గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం పార్వతీపురం మండలం హెచ్ కారాడవలస లేఔట్లో గల ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. 181 గృహాల్లో కొద్ది గృహాలు మాత్రమే పూర్తిస్థాయిలో పనులు జరగడాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు.