ADB: వర్షా కాలం దృష్టిలో ఉంచుకొని వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని తాంసి PHC హెల్త్ సూపర్వైజర్ రాథోడ్ తులసి రాం అన్నారు. శనివారం తాంసి మండలంలోని పొన్నారిలో ఆరోగ్యం శిబిరం ఏర్పాటు చేసి రోగులకు మందులు పంపిణీ చేశారు. చిన్నారులకు టీకాలు వేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ANM లక్ష్మి, సిబ్బంది ఉన్నారు.