PPM: జిల్లా ఆసుపత్రిలో నీటి కొరత ఉండరాదని ముఖ్యంగా రానున్న వేసవి దృష్ట్యా ఇప్పటి నుండే తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిర్ణయించింది. ఈమేరకు అదనంగా ఒక బోరును ఏర్పాటు చేయుటకు, మున్సిపల్ లైను ఒకటి వేయుటకు అంగీకారం తెలియజేసింది. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.