ప్రకాశం: కంభం మండలంలోని నల్ల కాలువ సచివాలయాన్ని స్థానిక ఎంపీడీవో వీరభద్రాచారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెక్ట్ సమయానికి సిబ్బంది అందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ సబ్మిట్ చేయాలన్నారు. అనంతరం డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి ఏపీ సేవా సర్వీసెస్ అమౌంట్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు రెమిటెన్స్ చేయాలని ఎంపీడీవో సిబ్బందిని ఆదేశించారు.