TG: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి.. ఈ నిమజ్జన ప్రక్రియను తిలకించారు. ‘జైజై గణేశా’, ‘గణపతి బప్పా మోరియా’ వంటి నినాదాలతో ఏకదంతుడిని సాగనంపారు. అంతకుముందు ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.