SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి చిన్న కృష్ణాపురం మోడల్ ప్రైమరీ పాఠశాలలో శనివారం అభినందన సభ నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం ధనుంజయరావు తెలిపారు. 14వ వార్డు టీడీపీ ఇంఛార్జ్, స్థానిక కూటమి నాయకులు కూన రాము ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుర్తింపు కార్డులను వితరణగా ఇచ్చారని అన్నారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది ఆయనకు గౌరవ సన్మానం చేసినట్లు తెలిపారు.