ఎండు చేపలను తరుచూ తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం. అలసట ఉండవు. మెదడులో వాపు తగ్గుతుందట. అంతేకాదు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు ఎండు చేపలను తింటే మంచిది. అయితే హైబీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వీటిని తినాలని నిపుణులు చెబుతున్నారు.