ఐక్యరాజ్యసమితి(ఐరాస) జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు భారత ప్రధాని మోదీ హాజరు కావడం లేదు. సెప్టెంబర్ 9న సెషన్ ప్రారంభం కానుండగా, అత్యున్నత స్థాయి చర్చా సమావేశాలు సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరుగుతాయి. మోదీ స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 27న ప్రసంగిస్తారని ఐరాస తాత్కాలిక జాబితాలో వెల్లడైంది.