NLR: ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు గిరిజనుల సమస్యల పరిష్కారానికై ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తహసిల్దార్ మురళి తెలిపారు. భూమి, రెవెన్యూ సంబంధిత సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించాలని, గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.