W.G: మిషన్ శక్తి సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా తణుకు కొండాలమ్మ గుడి పరిధిలోని డ్వాక్రా సంఘం సభ్యులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పౌష్టికాహారం, గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. CDPO శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఏఎన్ఎం పాల్గొన్నారు.