నటుడు మంచు మనోజ్(Manchu Manoj) తమకు విలువైన గిఫ్ట్ పంపించినందుకు స్టార్ హీరో రామ్ చరణ్(ram charan), ఉపాసన(Upasana) దంపతులకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆయన పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా గిఫ్ట్ ఫొటోలను పంచుకున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ పవర్ కపుల్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) గురించి నటుడు మంచు మనోజ్ కుమార్(Manchu Manoj kumar) ఆసక్తికర ట్వీట్ చేశారు. తమకు విలువైన గిఫ్టును పంపించిన ఇద్దరికీ స్పెషల్ గా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు తొందరలోనే మీ మాల్దీవుల పర్యటన తర్వాత వచ్చి మిమ్మల్నికలుస్తానని మనోజ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చరణ్ కపుల్ పంపించిన బహుమతి చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గిఫ్టులో ఒకరినొకరు ముద్దాడటానికి ప్రయత్నిస్తున్న అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఆ లాడ్రో లగ్జరీ బహుమతి విలువ రూ.70,500 ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ పోస్ట్ పెట్టడం వెనుక అసలు కారణం ఏంటని పలువురు కామెంట్లు చేస్తున్నారు. తన సోదరుడు మంచు విష్ణు..మనోజ్ పెళ్లికి వచ్చినా కూడా గిఫ్టు తేలెదని చెప్పడానికే ఇలా పరోక్షంగా ట్వీట్ చేసి చెబుతున్నారా అని పలువురు అనుమానిస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు(manchu vishnu).. మనోజ్ ఫ్యామిలీపై దాడికి వచ్చాడని గతంలో ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయని చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత వీరి తండ్రి మోహన్ బాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పారని తెలిసింది. అంతేకాదు ఇటీవల మనోజ్ మీడియాతో అసభ్య పదజాలంతో మాట్లాడటం కూడా కొత్త సమస్యలకు దారి తీస్తుందని ఇంకొంత మంది అంటున్నారు.
Surprise gifts like these are ❤️
Thank you to the sweet couple @AlwaysRamCharan & @upasanakonidela for the lovely gesture.. Love you Mr & Mrs Mithrama ❤️ Can't wait to meet you guys after your trip from Maldives,,have an amazing time😍 Much love from M & M. 🤗 pic.twitter.com/Ex3EpRFDGJ
ఏది ఏమైనా మంచు మనోజ్ మాత్రం తన పెళ్లి తర్వాత స్పీడ్ పెంచాడని తెలుస్తోంది. మంచు మనోజ్ మార్చి 3న భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పరిశ్రమలోని నటుడి సన్నిహితులు హాజరయ్యారు. రామ్ చరణ్ అప్పుడు కనిపించనప్పటికీ, మనోజ్ కొత్త భార్య సోదరి మంచులక్ష్మితో కలిసి ఇటీవల హైదరాబాద్‌లోని అతని ఇంట్లో ప్రైవేట్ పుట్టినరోజు పార్టీకి రామ్ చరణ్ హాజరయ్యారు.
ఇదిలా ఉంటే ఇటీవల భూమా మౌనిక రెడ్డిని పెళ్లాడిన మనోజ్ తన కొత్త ప్రాజెక్ట్ ‘వాట్ ది ఫిష్’ చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. నటుడు 2017 తర్వాత నటుడిగా సెట్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నాడు. మనోజ్ చాలా కాలం పాటు బహిరంగ ప్రదర్శనలు, సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నాడు.