TPT: ఎర్పేడు మండలంలోని దేశంలోనే అత్యంత ప్రాచీన శివాలయంగా గుర్తింపు పొందిన గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నెల 8 నుంచి బాలాలయం నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.