AP: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 7న మ.3:30 నుంచి 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 8వ తేదీ దర్శనం కోసం 7వ తేదీ వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 8వ తేదీన నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇస్తారు. 7వ తేదీ శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేశారు.