SKLM: నరసన్నపేట పరిధిలో మంగళవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పాలకొండ పేటలో నలుగురిని పట్టుకుని రూ.4,500 నగదు స్వాధీనం చేసుకోగా.. ఉర్లాం తోటల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.25,500 నగదు స్వాధీనం చేసుకుని, 10 మందిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి.గణేష్ తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.