VKB: కుల్కచర్ల మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించారు. ఆనాటి ఉపాధ్యాయులు, చిన్ననాటి మిత్రులు కలుసుకున్నారు. అప్పటి పీడీ రాములు మాట్లాడుతూ.. 2000-2001 పదో తరగతి బ్యాచ్‌ను గోల్డెన్ బ్యాచ్‌గా అభినందించారు.