కాకినాడ నుంచి ద్రాక్షారామం తరలిస్తున్న రెండు ఆటోలను తనిఖీ చేసిన కరప ఎస్ఐ సునీత 39 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,87,860గా నిర్ధారించారు. బియ్యం, ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.