కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాసలీలల ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Puttur BJP MLA:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బసవరాజు బొమ్మై (bommai) ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అందుకే అతను హీరో సుదీప్ (sudeep) చేత ప్రచారం చేయిస్తున్నారు. ఇదే విషయాన్ని విపక్షాలు కూడా అంటున్నాయి. కర్ణాటకలో (karnataka) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం పక్కా అనే మాట వినిపిస్తోంది. దీనికి తోడు పుత్తూరు బీజేపీ ఎమ్మెల్యే (bjp mla) రాసలీలలు వెలుగుచూశాయి. ఇదీ పార్టీకి మరింత చెడ్డ పేరు తీసుకొస్తోందని కొందరు అంటున్నారు.
పుత్తూరు బీజేపీ ఎమ్మెల్యే సంజీవ మఠందూర్ (sanjeeva) మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో (social media) ట్రోల్ అవుతున్నాయి. ఫోటోలు బయటకు రాగానే.. సదరు మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఉప్పినంగడి పీఎస్ వద్దకొచ్చి కంప్లైంట్ చేశారు. సంజీవకు (sanjeeva) ఈ సారి టికెట్ రావొద్దనే లాబీయింగ్ నడుస్తోందట.. అందుకే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయట. తర్వాత సంజీవ కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఎమ్మెల్యే పేరు ప్రస్తావించలేదు. అతని పేరు కూడా మెన్షన్ చేయలేదు. తన ఫోటో (photo) మార్చారని మాత్రం పేర్కొన్నారు. ఆ తర్వాత మహిళ (woman) ఓ వీడియో విడుదల చేసింది. ఎమ్మెల్యేతో తనకు సంబంధం లేదని పేర్కొంది. తనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని వివరించింది. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. విచారించి న్యాయం చేయాలని సదరు మహిళా కోరుతున్నారు. కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలను ప్రకటిస్తారు.