Raviteja : ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసురతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. ఆర్టీ టీం వర్క్స్ సంస్థతో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.
ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత.. మూడు నెలల గ్యాప్‌లో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఏప్రిల్ 7న రావణాసుర రిలీజ్ కాబోతోంది. సుధీర్ వర్మ డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో.. రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లుగా.. టైటిల్‌తోనే చెప్పేశారు. కానీ ట్రైలర్లో రవితేజ రావణుడా, రాముడా? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ప్రమోషన్స్‌లో కూడా ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అసలు రావణాసుర మెయిన్ పాయింట్ ఏంటనేది.. సినిమా పై అంచనాలను పెంచేలా చేసింది. అలాగే ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. కానీ అసలు హీరోయిన్ ఎవరు.. రవితేజతో రొమాన్స్ చేసింది ఎందరితో.. అనే విషయాల్లోను కూడా క్లారిటీ లేదు. మొత్తంగా ఈ సినిమాలో ఎవరు ఊహించిన సర్ ప్రైజ్‌లు ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. నిజంగానే వీళ్లు చెబుతున్నట్టుగా సినిమా ఊహించని విధంగా ఉంటే.. రవితేజ ఖాతాలో హ్యాట్రిక్ పడినట్టే. అలాగే మాస్ మహారాజా బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఈజీగా రీచ్ అవడమే కాదు.. భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకు జరిగిందని అంటున్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలుపుకొని.. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రావణాసుర రంగంలోకి దిగుతున్నాడు. ప్రజెంట్ రవితేజ హిట్ ట్రాక్ చూస్తే.. ఇదేం పెద్ద టార్గెట్ కాదు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్ర రిస్కే. అయితే ధమాకా 100 కోట్లు, వాల్తేరు వీరయ్య 200 కోట్లు రాబట్టాయి కాబట్టి.. రావణాసుర ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా.. రవితేజ మరో 100 కోట్లు తన ఖాతాలో వేసుకోవడం పక్కా. మరి మాస్ రాజా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.