VZM: ఎల్.కోట మండలం గోల్డ్ స్టార్ వద్ద గల శ్రీ వెంకటసాయి కళ్యాణ మండపంలో ఎల్.కోట మండల వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.