నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో విషాదం జరిగింది. శనివారం కొండ బిట్రగుంటలోని కోనేరులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు. మంచినీళ్లు కోసం దిగి బురదలో కూరుకొని మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుడు బిట్రగుంటలోని అరవపాలేనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.