KMM: జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కలెక్టర్ అనుదీప్‌తో ఫోన్లో మాట్లాడి సమీక్షించారు. ప్రస్తుతం పెద్ద సమస్యలు లేవని, అయితే భారీ వర్షాలు కొనసాగితే వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ రవిచంద్రకు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హామీ ఇచ్చారు.