HYD: హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేశ్ మండపంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగా రూపొందించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. మండపాన్ని ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఇది హిందూ భక్తుల భావోద్వేగాలను దెబ్బతీస్తోందని, పోలీసులు వెంటనే చర్య తీసుకుని మండపాన్ని తొలగించాలని అన్నారు.