భాగ్యనగరంలో (bhagyanagaram) నేడు (ఏప్రిల్ 6) హనుమాన్ జన్మోత్సవ్ లేదా హనుమాన్ జయంతి (hanuman jayanti 2023, hanuman janmotsav) సందర్భంగా శోభాయాత్ర (hanuman shobha yatra 2023 )నిర్వహిస్తారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం (karmanghat anjaneyaswamy temple) నుండి తాడ్ బంద్ వీరాంజనేయ స్వామి గుడి (tadband veeranjaneya swamy) వరకు జరిగే శోభాయాత్ర (hanuman shobha yatra) సజావుగా సాగేందుకు, నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరో శోభాయాత్ర మధ్యాహ్నం గం.11.30 నిమిషాలకు గౌలిగూడ రామమందిరం నుండి తాడ్ బంద్ ఆంజనేయ స్వామి గుడికి 12 కిలో మీటర్ల మేర ఉంటుంది.
గౌలిగూడ రామమందిర నుండి తాడ్ బంద్ వరకు జరిగే శోభాయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. రామాలయం, పుత్లీబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంకు రోడ్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్, రాంకోఠి క్రాస్ రోడ్, కాచిగూడ క్రాస్ రోడ్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీ నగర్, వైస్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడి గూడా, సీజీవో టవర్స్, బన్సీలాల్ పేట రోడ్, సిటీ లైట్ హౌస్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి ఆలయం, ఓల్డ్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్ మీదుగా తాడ్ బంద్ కు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంటుంది.
కర్మాన్ ఘాట్ నుండి మరో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుండి చంపాపేట, మలక్ పేట ఏసీపీ ఆఫీస్, సరూర్ నగర్ పోస్టాఫీస్, కొత్తపేట జంక్షన్, దిల్ సుఖ్ నగర్, నల్గొండ క్రాస్ రోడ్స్, కోఠి, కాచిగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, గాంధీ నగర్ జంక్షన్, కవాడి గూడ క్రాస్ రోడ్స్, బాటా, మహంకాళి ఆలయం, సీటీవో జంక్షన్, బ్రూక్ బాండ్ క్రాస్ రోడ్స్ మీదుగా తాడ్ బంద్ చేరుకుంటుంది. కాబట్టి ఈ మార్గాల్లో ఈ రోజు ప్రయాణించేవారు మరో మార్గాన్ని చూసుకోవాలి. ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని పోలీసులు కోరారు.
ఆఫ్జల్ గంజ్ నుండి వచ్చే వాహనాలను ఎస్ఏ మస్జీద్ నుండి ఎంజీబీఎస్ వైపు మళ్లిస్తారు.
రంగమహల్ నుండి ట్రాఫిక్ ను సీబీఎస్ వైపు మళ్లిస్తారు.
కోఠి వైపు వచ్చే వాహనాలను చాదర్ ఘాట్ ర్కాస్ రోడ్స్ నుండి నింబోలి అడ్డ మీదుగా రంగమహల్ వైపు మళ్లిస్తారు. కాచిగూడ నుండి ట్రాఫిక్ ను లింగంపల్లి క్రాస్ రోడ్స్ నుండి పోస్టాఫీస్ రోడ్డు, చప్పల్ బజార్ వైపు మళ్లిస్తారు.
నారాయణగూడ షాలిమార్ థియేటర్ వైపు వాహనాలను ఈడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు.
లక్డీకాపూల్ నుండి కోఠి మీదుగా దిల్ సుఖ్ నగర్ వెళ్లేవారు బషీర్ బాగ్, హిమయత్ నగర్ వై జంక్షన్, నారాయణ గూడ ప్లై ఓవర్, బర్కత్ పుర, ఫీవర్ హాస్పిటల్, తిలక్ నగర్, ఛే నంబర్, అలీ కేఫ్ క్రాస్ రోడ్, మూసారాంబాగ్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వెళ్లాలని సూచించారు.
దిల్ సుఖ్ నగర్ నుండి కోఠి మీదుగా మెహిదీపట్నం వెళ్లేవారు.. ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ మీదుగా లేదా ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, ఆరామ్ నగర్, అత్తాపూర్ మీదుగా మెహిదీపట్నం వెళ్లాలని సూచించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (040 2785 2482), ట్రాఫిక్ హెల్ప్ లైన్ (9010203626) లకు ఫోన్ చేయవచ్చు.