GNTR: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం జరగనున్న ‘కన్నప్ప’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం రాత్రి పరిశీలించారు. పలు బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే ఈ వేడుకను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎస్పీ వేడుక జరిగే ప్రాంతాన్ని సందర్శించి, అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.