MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామ శివారులలో గోదావరి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో గడిచిన 8 గంటలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎగువ ప్రాంతంతో పాటు వాగులు, వంకలలో ప్రవహిస్తున్న వరదనీరు గోదావరి నదిలో కలుస్తోంది. మండలంలోని కలమడుగు, ధర్మారం, రోటిగూడ, తపాలాపూర్, రాంపూర్ శివారులలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.