CTR: భూ వివాదంతో ఘర్షణ పడిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ షావలి బుధవారం తెలిపారు. మొరవ పల్లికి చెందిన నరసింహులు, ఎర్రయ్య సోదరుల మధ్య భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఘర్షణ పడటంతో నరసింహులు భార్య చంద్రమ్మకు, ఎర్రయ్యకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.