సత్యసాయి: లేపాక్షి వీరభద్రాలయంలో ఈనెల 30న ఉదయం 10 గంటలకు ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు, లేపాక్షి వాసులకు దుర్గాదేవి శేష వస్త్రాలను పంపిణీ చేయనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కరణం రమానందన్ తెలిపారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలతో పాటు పసుపు, కుంకుమను కూడా మహిళలకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.