HYD: భారీ వర్షాల నేపథ్యంలో మల్లేపల్లి డివిజన్ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడుతున్నప్పుడు బయటకు రావద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనుమతి లేకుండా మ్యాన్‌హోల్ మూతలు తెరవద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.