TG: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీభవన్ చేరుకున్నారు. ఆయనతో పాటు సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఉన్నారు. అక్కడ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించి, వారికి ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు.