ATP: తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థిని గౌసియా రాష్ట్రస్థాయి విజేతగా నిలిచింది. విజయవాడలోని KL యూనివర్సిటీలో AP ఎయిడ్స్ నివారణ సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలలో ప్రతిభ కనబరిచి రూ.10 వేలు చెక్కును బహుమతిగా అందుకుంది. వచ్చే నెల 7న ముంబైలో జరిగే జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపల్ తెలిపారు.