SRD: జిల్లాలోని అన్ని పాఠశాలలు ఈనెల 31వ తేదీ వరకు డీసీఈబీ పరీక్ష ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఫీజు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఫీజు చెల్లించిన తర్వాత సంబంధిత రసీదులు కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.