WGL: వ్యవసాయానికి వరంగల్ పెట్టింది పేరు. పత్తి, వరి, మిరప, మొక్కజొన్న, కూరగాయల సాగుతో ఉమ్మడి జిల్లా రైతులు మంచి లాభలు గడిస్తుంటారు. అయితే రసాయనాలు కాకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఫలితంగా భూ కాలుష్యం తగ్గడం, భూసారం పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్నారు. పెట్టుబడి తగ్గుందని, పంటకు సైతం గిట్టుబాటు ధర ఉంటుందన్నారు.