»Only Red Button And Green Button Are Known In Mobile
Etala rajender:మొబైల్లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు: ఈటల
పదో తరగతి హిందీ పేపర్ లీక్‌కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ టీవీ డిబెట్లో మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని అడగగా.. తనకు మొబైల్లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.
Only red button and green button are known in mobile
Etala rajender:పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ (SSC Paper leak) ఇష్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను (bandi sanjay) ఏ21గా రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala rajender) మాట్లాడారు. ఈటలకు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని ఓ టీవీ డిబేట్లో చర్చ జరిగింది. దీనిపై ఈటల (etala) స్పందిస్తూ.. తనకు మొబైల్లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.
తనకు వాట్సాప్ వచ్చినట్టు తెలియదని చెప్పారు. వాట్సాప్ తాను చూడనని స్పష్టంచేశారు. తన పీఏలు (pa) మాత్రమే చూస్తారని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండటంతో టెస్టుల కోసం నిన్న 9 గంటలపాటు ఆఫ్ చేశానని వివరించారు. దీనికి సంబంధించి విచారణ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు.