NGKL: జిల్లాలో దివ్యాంగుల గుర్తింపు, UDID నమోదు కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. మార్చి 5 నుంచి 31 వరకు వివిధ తేదీల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిబిరాలు కొనసాగనున్నాయి. అర్హులైన దివ్యాంగులు అవసరమైన వైద్య పత్రాలు, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరై నమోదు చేసుకోవాలని సూచించారు.