SRPT: టీచర్ల పదోన్నతుల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈనెల 21న పదోన్నతుల ప్రక్రియ ప్రారంభంకాగా మొదటగా అర్హులైన SAలను GHMలుగా పదోన్నతి కల్పించారు. ఆతర్వాత SGTల నుంచి SA, PS HMలుగా ప్రమోషన్ కల్పించేందుకు ఈ నెల 25 రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. మంగళవారం DEO ప్రమోషన్లు పొందిన వారికి ఆర్డర్లు ఇచ్చి ఆయా పాఠశాలల్లో జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.