MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం, తుర్కపల్లి డివిజన్ పరిధి వెంకన్న కాలనీలో మంగళవారం సుమారు రూ.39 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్కును పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.