TG: రాష్ట్రంలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, కేటీఆర్కు దిశానిర్దేశం చేశారు. సంఖ్యాబలం, అభ్యర్థుల ఎంపిక, ఇతర రాజకీయ సమీకరణాలపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, సభలో పార్టీ గొంతుకను ఎలా బలంగా వినిపించాలనే అంశాలపై కేటీఆర్కు కేసీఆర్ పలు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.