Daggubati mohan babu:విక్టరీ హీరో వెంకటేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు (Daggubati mohan babu) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు ప్రకాశం జిల్లా కారంచేడులో కన్నుమూశారు. మోహన్ బాబు దివంగత నిర్మాత రామానాయుడు (Rama naidu) సోదరుడు అనే సంగతి తెలిసిందే.
మోహన్ బాబు మృతి వార్త తెలిసిన వెంటనే సురేశ్ బాబు (suresh babu) కారంచేడు చేరుకున్నారు. తన బాబాయ్‌కి నివాళులు అర్పించారు. సురేశ్‌తోపాటు హీరో అభిరామ్ (abhiram), సురేశ్ బాబు మేనల్లుడు అశోక్ బాబు (ashok babu) కూడా వెళ్లారు. దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియలను రేపు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో వెంకటేశ్ (venkatesh), రానా (rana).. ఇతర దగ్గుబాటి కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
దగ్గుబాటి మోహన్ బాబు.. అసలు పేరు దగ్గుబాటి రామ్మోహన్ రావు (Ram mohan rao).. కానీ ఆయనను అంతా మోహన్ బాబు అని పిలుస్తారు. రామానాయుడు (Rama naidu) హైదరాబాద్ (hyderabad), చెన్నైలో (chennai) వ్యాపారాలు నిర్వహించే సమయంలో కుటుంబానికి చెందిన వ్యాపారాలు, వ్యవసాయం మోహన్ బాబు చూసుకునేవారట.