»Producer Dil Raju Clarity On Political Entry In Telangana
Dil Raju: పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు క్లారిటీ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి వస్తాడని(political entry) పుకార్లు వచ్చిన నేపథ్యంలో వాటిపై ఆయన తాజాగా స్పందించారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు.
ఇటీవల ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని సోషల్ మీడియా(social media)లో తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) హత్ సే హత్ జోడోయాత్ర పేరుతో నిజామాబాద్ జిల్లాలో(nizamabad district) పర్యటించారు. ఆ క్రమంలో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని దిల్ రాజు ఆహ్వానించారు. దీంతో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. రేవంత్ రాక సందర్భంగా మోపాల్ మండలం దిల్రాజు సొంత గ్రామమైన నర్సింహపల్లిలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆయనను పిలిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే ఇదే పొలిటికల్ ఎంట్రిపై గతంలో సైతం వార్తలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, వ్యాపారవేత్తగా ఉన్న దిల్ రాజు(Dil Raju) త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అతని పుట్టినరోజు సందర్భంగా ప్రచారం జరిగింది. సమాజానికి తిరిగి ఇవ్వడం, సామాజిక సమస్యలు, సహాయం అవసరం, సామాజిక సేవ వంటి అంశాలపై దిల్ రాజు అప్పుడు మాట్లాడిన క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ జరిగింది. ఆ క్రమంలోనే తాను విద్య, ఆరోగ్యం అనే రెండు కీలక అంశాలపై ఆసక్తి కూడా చూపారని తెలిసింది. కానీ అవి అమల్లోకి రాలేదు.
ఈ క్రమంలో తాజాగా దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించారు. తనను కొంత మంది నేతలు రాజకీయాల్లోకి రావాలని అడిగినట్లు వెల్లడించారు. కానీ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశారు. మరోవైపు సినిమాల విషయంలో తనపై చిన్న చిన్న కామెంట్లు వస్తేనే తట్టుకోలేనని..అలాంటిది రాజకీయాల్లో అనేక విమర్శలు వస్తే ఎలా ఉంటుందోనని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం పొలికల్ ఎంట్రీ లేదని చెప్పుకొచ్చారు. ఇటీవలే “బలగం”(balagam movie) చిత్రానికి ప్రశంసలు అందుకున్న దిల్ రాజు..ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.