ADB: సైబర్ నేరాలను ప్రజల అప్రమతతోనే అడ్డుకట్ట వేయగలమని జిల్లా SP అఖిల్ మహాజన్ ఆదివారం తెలియజేశారు. సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నవీన పద్ధతులను ప్రజలకు అవగాహన కల్పించాలని సదుద్దేశంతో ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ అనే పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 ద్వారా పోలీసు సహాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.