KMM: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమైనందున నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు.