»Liquor Shops Closed In Hyderabad On April 6th 2023 Hanuman Jayanti
Liquor Shops Closed: ఎల్లుండి హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్
హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ఏప్రిల్ 6న హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్(Liquor shops closed) కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీసులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే హైదరాబాద్(hyderabad), సికింద్రాబాద్(secunderabad) పరిధిలో ఏప్రిల్ 6న వైన్ షాపులు బంద్(Liquor shops closed) పాటించనున్నాయి. అయితే శ్రీహనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న(గురువారం) అన్ని మద్యం షాపులను మూసివేయనున్నట్లు రాచకొండ పోలీసులు ప్రకటించారు. వైన్ షాపులతోపాటు వాటికి అనుబంధంగా ఉన్న బార్లు (స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్లు మినహా) అన్ని కూడా ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మూసివేయబడతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రాచకొండ పోలీసులు వివరాలను వెల్లడించారు.
అయితే ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు ఎలాంటి ఘర్షణ సహా గొడవలు జరుగకుండా ఉండేందుకే మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వైన్ షాపులు తెరిచినట్లైతే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.