నటి రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరలవుతున్నాయి. ‘నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ ఆ క్షణం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్నాను. నా పిల్లలను ఎంతో సురక్షితంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేంత ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పిల్లల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.