GNTR: స్నేహితునికి పూర్వ విద్యార్థులు సహాయం చేశారు. ఘంటసాల మండలం గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన గరికపాటి కిషోర్ రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఇంటికి పరిమితమయ్యాడు. అతని పరిస్థితి తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు ఆదివారం రూ. 41 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. వెనిగళ్ళ తారక జగదీష్, పులి బాబి, గంజాల శ్రీనుబాబు, సుబ్రహ్మణ్యం, ఖాజా బాబు తదితరులు ఉన్నారు.