NLG: హన్మకొండ పోలీసులు లావుడి సరిత (27) అనే మహిళను అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈమె, విలాసవంతమైన జీవితం కోసం 2023 నల్గొండ, హైదరాబాద్, నార్కెట్‌పల్లి ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటూ, తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకుని, ఇతర యువతుల మొబైల్ ఫోన్లు, నగదు దొంగిలించేది. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమెను ఎస్సై అదుపులోకి తీసుకున్నారు.