»Bandi Sanjay Said Brs And Congress Will Alliance In The Next Election In Telangana 2023
Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ కలుస్తాయ్!
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే BRS, కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(bandi sanjay) అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేశాడని సంజయ్ ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(congress) పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(bandi sanjay)అన్నారు. ఈ క్రమంలో బీజేపీ(BJP) రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాంటి అవకాశం ఉందని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్పినట్లు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్(CM KCR) చేసిన సర్వేలతో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సూచించాయని ఆయన అన్నారు. ములుగు జిల్లా పోలింగ్ బూత్ సమ్మేళన సమావేశంలో భాగంగా సంజయ్ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్(KCR)కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలు(People)కేసీఆర్ ను నమ్మి రెండు సార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడని ఆరోపించారు. మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఇంకా దారుణంగా తయారు చేస్తాడని విమర్శించారు.
మరోవైపు తన కొడుకు, కూతురు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీ(TSPSC), మద్యం కుంభకోణాలపై కేసీఆర్(KCR) ఎందుకు మౌనంగా ఉన్నారని సంజయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టిఎస్పిఎస్సి గందరగోళంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు అనుమతించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు పథకం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్సిడీలు నిలిపివేసి.. యూరియా, విత్తనాలు ఉచితంగా సరఫరా చేస్తుందని ఎద్దేవా చేశారు.
రూ.75 కోట్ల నగదును బీఆర్ఎస్కు అందజేసినట్లు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రజల(people) దృష్టిని మరల్చడానికి కేసీఆర్ కొంతమంది మహారాష్ట్ర నాయకులను బీఆర్ఎస్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం లోయర్ గ్రేడ్ ఉద్యోగులను బలిపశువులను చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.