MLG: ఏటూరునాగారం మండలం కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది . మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మాను శుక్రవారం భద్రతా బలగాలు ట్రాప్ చేసినట్లు సమాచారం. అయితే హిడ్మాను ట్రాప్ చేసిన పోలీసులు అతడిని సజీవంగానే పట్టుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భీకర దాడుల్లో ఇప్పటికే ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు.