NLG: భూ భారతి చట్టం ద్వారా భూముల వివరాలన్నీ ఆన్లైన్లో తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తెలంగాణ భూ భారతి చట్టం (భూమి హక్కుల చట్టం- 2025)పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా, చిట్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.