KMM: ఉమ్మడి జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవరావు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం జూలూరుపాడులో నిర్వహించే భూభారతి అవగాహన సదస్సులో పాల్గొంటారని చెప్పారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.